అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘తండేల్’ తెరకెక్కింది.
ఇక ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి వసూళ్లు వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ చిత్రానికి సాలిడ్ వసూళ్లు వస్తుండటంతో 5 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.80.12 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచిందని.. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాలోని పాటలకు ఫిదా అవుతున్నారని.. ఇక నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తీసుకొచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు.