‘తండేల్’ కోసం చైతూ డెడికేషన్‌పై డైరెక్టర్ ప్రశంసలు

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసి గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి లవ్ స్టోరీ కథతో పాటు పీరియాడిక్ యాక్షన్‌ను ప్రేక్షకులకు అందించనుంది. ఇక ఈ సినిమాలో చైతూ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమా కోసం చైతూ చాలా హార్డ్ వర్క్ చేశాడని.. ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది సినిమాలో కనిపిస్తుందని దర్శకుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తండేల్ కోసం చైతూ ఎంతలా కష్టపడ్డాడంటే.. ఒక్క సీన్ కోసం ఆయన ఏకంగా 40 నిమిషాల పాటు బీచ్‌లో అలాగే నిల్చున్నాడని డైరెక్ట్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం కేవలం ఫిజికల్‌గానే కాకుండా తన పాత్ర కోసం ఉత్తరాంధ్ర యాస ను కూడా పర్ఫెక్ట్‌గా పలికేలా నేర్చుకున్నాడని దర్శకుడు తెలిపారు.

మొత్తానికి ‘తండేల్’ మూవీ కోసం నాగచైతన్య ఎంత కష్టపడ్డాడు అనేది దర్శకుడు చందూ మొండేటి తన ఇంటర్వ్యూలో చెప్పడంతో అభిమానులు తమ హీరో కోసం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version