స్టార్ హీరో చేతుల మీదుగా ‘తండేల్’ హిందీ ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే?

స్టార్ హీరో చేతుల మీదుగా ‘తండేల్’ హిందీ ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే?

Published on Jan 30, 2025 9:00 PM IST

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించగా పూర్తి పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో మనం చూస్తున్నాం.

అయితే, ఈ చిత్ర తమిళ్ ట్రైలర్‌ను హీరో కార్తీ తాజాగా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జనవరి 31న ముంబైలో జరిగే ఓ ఈవెంట్‌లో తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ ట్రైలర్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రిలీజ్ చేయనున్నారు. గతంలో ఆయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీలో నాగచైతన్య నటించాడు.

అందుకే ఇప్పుడు చైతూ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు