ప్రేమ కోసం మన హీరోలు దేనికైనా సిద్ధమవుతారు. వారు ఎలాంటి పరిస్థితులు కూడా దాటుకుని తమ ప్రేమను సాధించుకుంటారు. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో కనిపించాయి. అయితే, కొన్ని లవ్ స్టోరి చిత్రాల్లో మాత్రం ఈ ప్రేమ కోసం హీరోలు ఏకంగా దేశం సరిహద్దులు దాటారు. తాజాగా టాలీవుడ్లో తెరకెక్కిన తండేల్ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే హీరో పాకిస్థాన్ దేశంలో యాక్షన్ చేయనున్నట్లు చూపెట్టారు. దీంతో ఈ సినిమాలో హీరో దేశం సరిహద్దు దాటి తన ప్రేమను తిరిగి ఎలా సాధించుకుంటాడనేది మనకు ఈ సినిమాలో కూడా చూపెట్టబోతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే, ఈ ప్రేమ కథను దర్శకుడు చందూ మొండేటి ఎలా తీర్చిదిద్దాడనేది మనం సినిమా రిలీజ్ అయ్యాకే చూడగలం.
కాగా, ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో బాలీవుడ్లో తెరకెక్కిన ‘గదర్’ చిత్రం కూడా చాలా మందికి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఏకంగా పాకిస్థాన్‌లోని లాహోర్ వరకు వెళ్లి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఇదే తరహా పాయింట్ తండేల్‌లో ఉండనుండటంతో టాలీవుడ్‌కి ఇది మరో గదర్ కానుందని అభిమానులు అంటున్నారు. మరి గదర్ స్థాయిలో తండేల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.