‘తండేల్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతో తెలుసా?

‘తండేల్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతో తెలుసా?

Published on Jan 30, 2025 1:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘తండేల్’ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించగా దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు. పీరియాడిక్ కథ నేపథ్యంలో లవ్ స్టోరీని ఈ సినిమాలో మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చందూ మొండేటి ‘తండేల్’ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఫైనల్ రన్ టైమ్‌ను 2 గంటల 25 నిమిషాలుగా ఫిక్స్ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు తొలుత 2 గంటల 45 నిమిషాలు గా ఉందని.. ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేయడంతో ఫైనల్ రన్‌టైమ్ లాక్ అయ్యిందిన ఆయన తెలిపారు.

మొత్తానికి ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ ఎంత అనేది దర్శకుడు చందూ మొండేటి వెల్లడించడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు