పిక్ టాక్: ‘తండేల్’ ట్రైలర్ రెస్పాన్స్‌కు ఫుల్ హ్యాపీస్!

పిక్ టాక్: ‘తండేల్’ ట్రైలర్ రెస్పాన్స్‌కు ఫుల్ హ్యాపీస్!

Published on Jan 29, 2025 10:00 PM IST

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ వచ్చే వారం రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కింది.

ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వారు ముగ్గురు కలిసి సంతోషంగా నవ్వుతూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తండేట్ చిత్ర ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌కు వారు సంతోషంగా ఉన్నారంటూ ఈ ఫోటోకు అభిమానులు క్యాప్షన్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు