‘గేమ్ ఛేంజర్’తో పోటికి సిద్ధమవుతున్న ‘తండేల్’..?

‘గేమ్ ఛేంజర్’తో పోటికి సిద్ధమవుతున్న ‘తండేల్’..?

Published on Oct 15, 2024 9:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పొలిటిక్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమాను తొలుత డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని చూసినా, కొన్ని కారణాల వల్ల సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దీంతో ఈ సంక్రాంతి తమదే అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. రామ్ చరణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ కూడా వాయిదా వేసుకున్నాడు. ఇక సంక్రాంతి పండుగకు వెంకీ అనిల్ రావిపూడి సినిమా, NBK109 చిత్రాలు కూడా ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్నాయి. అయితే, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో పోటీకి మరో మూవీ కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందట. దీంతో ఈసారి సంక్రాంతి వార్ ‘గేమ్ ఛేంజర్’ వర్సెస్ ‘తండేల్’గా మారనుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ‘తండేల్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నిజంగానే సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ను ‘తండేల్’ ఢీకొంటుందా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు