తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’ ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే, ఇందులో నటించిన హీరోయిన్ తాను నటి కాకపోయి ఉంటే టీ అమ్ముకునేదాన్ని అని చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
‘తంగలాన్’ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు అనే ప్రశ్నకు వీరిరువురు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నటిని కాకపోయి ఉంటే టీ అమ్ముకునేదాన్ని.. వృత్తి ఏదైనా గౌరవంతో పనిచేయాలని అనుకునేదాన్ని.. అందుకే టీ షాప్ పెట్టుకోవాలని అనుకున్నా.. అంటూ పార్వతి తిరువోతు చెప్పుకొచ్చింది.
ఇక మరో హీరోయిన్ మాళవిక మోహనన్ తనకు విజువల్ ఆర్ట్స్ అంటే ఇష్టమని.. నటి అవకపోయి ఉంటే ఫోటోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి అడుగుపెట్టేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తంగలాన్ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.