“తంగలాన్” ఆడియో లాంఛ్ కి డేట్ ఫిక్స్!

డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, తదుపరి తంగలాన్ చిత్రంలో కనిపించనున్నాడు. సంచలన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసారు.

ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 2 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాక ఆడియో లాంఛ్ కి సంబందించిన అప్డేట్ ను కూడా వెల్లడించారు. ఆగస్టు 5 వ తేదీన ఆడియో లాంఛ్ ఉండనుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version