బ్లాక్‌బస్టర్ దిశగా ’తంగలాన్‘ పరుగులు

బ్లాక్‌బస్టర్ దిశగా ’తంగలాన్‘ పరుగులు

Published on Aug 18, 2024 2:00 AM IST

తమిళ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఇటీవల ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేయడం.. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు వెరైటీ స్టఫ్‌ను ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగునాట మరికొన్ని సినిమాలు పోటీలో ఉన్నా కూడా ‘తంగలాన్’కు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఆగస్టు నెలాఖరు వరకు పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడంతో తంగలాన్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు