తమన్ నేపథ్య సంగీతానికి ధన్యవాదాలు – నాగవంశీ

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “మ్యాడ్”. ఈ చిత్రానికి ఇపుడు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రాబోతుంది. అయితే, ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్ డేట్ ను రివీల్ చేశారు నిర్మాత నాగవంశీ. తన ఎక్స్ ఎకౌంట్ లో నాగవంశీ పోస్ట్ చేస్తూ.. ‘మా సోదరుడు తమన్ మా బ్యానర్ లో మళ్లీ మాతో కలిసి పని చేసేందుకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. పైగా
మ్యాడ్ స్క్వేర్ లాంటి క్రేజీ సినిమా కోసం తమన్ వర్క్ చేయబోతూ ఉండటం ఇంకా సంతోషంగా ఉంది. తమన్ అందించిన అసాధారణ నేపథ్య సంగీతానికి ధన్యవాదాలు’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు.

కాగా శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం టీమ్ ముమ్మరంగా ప్రమోషన్స్ ను చేస్తోంది. సినిమా పై ఆల్ రెడీ భారీ బజ్ క్రియేట్ అయింది. పైగా చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

Exit mobile version