మా ‘హను మాన్’ కి ఇంత పెద్ద సక్సెస్ అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు – హీరో తేజ సజ్జ

మా ‘హను మాన్’ కి ఇంత పెద్ద సక్సెస్ అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు – హీరో తేజ సజ్జ

Published on Jan 28, 2024 12:29 AM IST


యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నిరంజన్ రెడ్డి నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని ఇంకా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక నేడు ఈ మూవీ యొక్క సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ, మా డీవోపీ శివ గారు మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారని అన్నారు. అలానే ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గారు ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ మూవీ కోసం ప్రాణం పెట్టారని అన్నారు. తన కో స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు తనకి యాక్టింగ్ విషయంలో కొంత హెల్ప్ చేసారని, అమృత అయ్యర్ గారి డెడికేషన్ సూపర్ అని అన్నారు. అలానే నటుడు వినయ్ రాయ్ గారికి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుందని తెలిపారు.

మొత్తంగా తమ టీమ్ మొత్తం కూడా అనుక్షణం కష్టపడ్డ హను మాన్ కి నేడు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని అన్నారు. ఇక నిర్మాత నిరంజజ్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో నమ్మారు, నేడు ఆ నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మా దర్శకుడు ప్రశాంత్ వర్మ గారి ఆలోచన, శ్రమ ఈ రోజు భారీ స్థాయి ఆదరణ అందుకుంటుండడం ఎంతో ఆనందాన్నిస్తోందని మరొక్కసారి ఆడియన్స్ కి తమ పర్సనల్ టీమ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తేజ సజ్జ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు