మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేయగా, ఈ చిత్రం పూర్తి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ చిత్రంపై అంచనాలను క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ సినిమా నుండి ‘తస్సదియ్యా’ అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రెట్రో వెర్షన్ సాంగ్‌గా ఇందులో వరుణ్ తేజ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక భాస్కరభట్ల రాసిన ఈ పాటను ప్రముఖ సింగర్ మనో పాడారు. జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ వీడియోను అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నవంబర్ 14న ‘మట్కా’చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.