లేటెస్ట్ : ప్రభాస్ ‘సలార్’ సీక్వెల్ పై ఆ వార్త నిజం కాదా ?

Published on Feb 5, 2023 11:11 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి రావు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తీయనున్నారని, మొదటి భాగం పూర్తి అయిన అంతరం సీక్వెల్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారని, ఇటీవల మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అసలు సలార్ మూవీ సీక్వెల్ అనేది లేదని, స్టోరీ మొత్తం ఒకటే సినిమాగా రానుందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటివరకు సలార్ టీమ్ నుండి రెండు భాగాలు అనే విషయమై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఒకటే సినిమాగా రానుందనేది నిజమని అంటున్నారు. మరి ఈ వార్తలపై సలార్ టీమ్ ఇకపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :