“RRR” పై అందరిలో ఆ ఒక్క హోప్ మాత్రమే.!

Published on Sep 21, 2022 7:06 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ సెన్సేషన్ ని రేపిన ఈ సినిమా ఫైనల్ గా ఆస్కార్ వరకు మన సినిమా నుంచి డెఫినెట్ గా వెళుతుంది అని అంతా ఆశించగా ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

దీనితో అభిమానులు మూవీ లవర్స్ సైతం చాలా నిరాశగా ఉండగా ఈ సినిమా ఆస్కార్స్ లో నిలిచే ఆ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇండియా తరపున వెళ్లకపోయినా డైరెక్ట్ నామినేషన్స్ లో బెస్ట్ పిక్చర్ గా నామినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనితో అయితే అందరూ ఈ ఒక్క ఆశపై మాత్రమే ఉందని అంటున్నారు. అది కూడా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఇవి సక్సెస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :