“పుష్ప 2” లో హాట్ టాపిక్ గా ఈ సీక్వెన్స్.!

“పుష్ప 2” లో హాట్ టాపిక్ గా ఈ సీక్వెన్స్.!

Published on Nov 9, 2023 12:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇండియన్ సినిమా దగ్గర మంచి అవైటింగ్ గా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ఒకటిగా అయితే ఈ భారీ సినిమా ఇపుడు నిలిచింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ని సుకుమార్ అనుకున్న ప్లాన్ ప్రకారం పక్కా ప్రణాళికతో కంప్లీట్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే సినిమాలో మేకర్స్ కంప్లీట్ చేసిన ఓ మాసివ్ సీక్వెన్స్ కోసం అంతా హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి రీసెంట్ గానే మేకర్స్ ఓ జాతరకు సంబంధించి ఓ భారీ యాక్షన్ అండ్ సాంగ్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేశారట.

దీనిని ఓ భారీ సెట్టింగ్ లో కంప్లీట్ చేయగా దీని అవుట్ పుట్ అయితే సాలిడ్ గా వచ్చింది అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సీక్వెన్స్ సినిమాలోనే ఒక ముఖ్యమైన హైలైట్ గా నిలుస్తుంది అని సమాచారం. మరి ఇందులో సుకుమార్ మరియు బన్నీల మ్యాజిక్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు