అందుకే ఆ సినిమాలు చేయలేదు – కమల్ హాసన్

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే భారీ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్ అద్భుతంగా నటించారు. పైగా కమల్ ది విలన్ పాత్ర కావడంతో ఆ పాత్ర మరింతగా పేలింది. ఐతే, ‘రోబో 2.o’లో కమల్ హాసన్ కి విలన్ గా చేయమని ఆఫర్ వచ్చింది.

కానీ, కమల్ హాసన్ మాత్రం ఆ పాత్ర చేయలేదు. ఈ విషయం పై కమల్ మాట్లాడుతూ.. ‘రోబో 2.o’లో నాకు విలన్‌గా అవకాశం వచ్చినా తిరస్కరించాను. ఆ పాత్ర నాకు సూట్ కాదు అనిపించింది. అలాగే, ‘రోబో’ సినిమాలో హీరో పాత్రకు ముందుగా తననే ఎంపిక చేశారని, కానీ.. అప్పటి తన మార్కెట్‌ దృష్ట్యా ఆ సినిమా చేయకపోవడమే మేలని వదులుకున్నట్లు కమల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Exit mobile version