‘ది బర్త్‌డే బాయ్’ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషం: నిర్మాత

‘ది బర్త్‌డే బాయ్’ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషం: నిర్మాత

Published on Jul 20, 2024 10:30 AM IST

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ‘ది బర్త్‌డే బాయ్’ చిత్రాన్ని బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు విస్కీ డైరెక్ట్ చేశారు. జూలై 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

పాజిటివ్ మౌత్‌ టాక్‌తో, క్రిటిక్స్‌ అభినందనలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్ ను మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా నిర్మాత భరత్‌ మాట్లాడుతూ.. ”నాకు సపోర్ట్‌ చేసిన నా స్నేహితులకు, నా ఫ్యామిలీకి థ్యాంక్స్‌. రాహుల్‌ మాచినేని అనే సూపర్‌ కెమెరామెన్‌ ఈ సినిమాకు దొరికారు. సంగీత దర్శకుడు ప్రశాంత్‌కు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. విస్కి వల్లే ఈ రోజు సినిమాకు ఇంత మంచి టాక్‌ వచ్చింది. కామన్‌ ఆడియన్స్‌ నుండి చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు.” అని అన్నారు.

దర్శకుడు విస్కి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మా నటీనటులదే. చిన్న సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు. కానీ మా సినిమా మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. మీరు మౌత్‌టాక్‌ తెలుసుకుని సినిమాకు వెళ్లండి. సినిమా థియేటర్స్‌ తిరిగి స్పందన తెలుసుకుంటున్నాం. అందరూ చాలా బాగా తీశారు అని మెచ్చుకుంటున్నారు. నా వాస్తవ జీవితంలో జరిగిన ఈ సంఘటనను థియేటర్‌లో ఆడియన్స్‌ కూడా ఫీల్‌ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాను చాలా సహజంగా తీశాను. నిజాయితీగా ఈ సినిమా తీశాను. సొంతంగా విడుదల చేశాం. మీరు సినిమా చూసి నచ్చితే నలుగురికి చెప్పండి.’’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు