‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఈ సిరీస్ మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మనోజ్ బాజ్‌పేయి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ కోసం మనం మరికొన్ని నెలలు వేచి ఉండాలి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్‌లో స్ట్రీమింగ్ కు రానుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మనోజ్ బాజ్ పేయి ఇంకా మాట్లాడుతూ.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3′ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని.. అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు.
మొత్తానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మూడో సీజన్ లో దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయీ కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.