బుల్లితెర పై డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న “ది ఫ్యామిలీ స్టార్”

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరోగా, చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ (The Family star) చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా వచ్చి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రం 6.11 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది డీసెంట్ రెస్పాన్స్ అని చెప్పాలి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయిన కల్కి 2898AD చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించి, అలరించారు.

Exit mobile version