కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన మూవీ ది ఘోస్ట్. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై నాగ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యొక్క సాంగ్, టీజర్, మోషన్ పోస్టర్, తమహాగనే థీమ్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని కూడా ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి.
ఇక ఈ మూవీ నుండి రిలీజ్ ట్రైలర్ ని సెప్టెంబర్ 30న సాయంత్రం 4 గం. 5 ని. లకు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించనున్నారు. కాగా ఈ మూవీ భారీ స్థాయిలో దసరా పండుగా కానుకగా అక్టోబర్ 5 న విడుదల కానున్న విషయం తెలిసిందే.