విజయ్ “ది గోట్” డే1 సెన్సేషన్ వసూళ్లు!


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ గా నిన్న థియేటర్ల లోకి వచ్చింది. ఈ చిత్రం డే 1 కి సంబందించిన వసూళ్ల వివరాలను మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం మొదటి రోజు 126.32 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

లియో చిత్రంతో 148.5 కోట్ల రూపాయలు డే 1 ఓపెనింగ్స్ అందుకున్నాడు. మరోసారి వంద కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించి, కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు విజయ్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

Exit mobile version