విజయ్ “ది గోట్” ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్న ప్రముఖ నిర్మాణ సంస్థ!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబర్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీనాక్షి చౌదరి కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, ప్రశాంత్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version