అక్కడ ప్రీ సేల్స్ తో దూసుకు పోతున్న “ది గోట్”

అక్కడ ప్రీ సేల్స్ తో దూసుకు పోతున్న “ది గోట్”

Published on Aug 21, 2024 12:01 AM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్. సెప్టెంబర్ 5, 2024 న థియేటర్ల లోకి రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

దీంతో సినిమా చూసేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు. ఇప్పటికే యూకే ప్రాంతంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించారు. అక్కడ ప్రీ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ 27,500 కి పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు