యూఎస్ ప్రీమియర్స్‌లో అదరగొట్టిన ‘ది గోట్’

యూఎస్ ప్రీమియర్స్‌లో అదరగొట్టిన ‘ది గోట్’

Published on Sep 5, 2024 11:00 PM IST

తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది గోట్’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, ఈ మూవీలో విజయ్ డ్యుయెల్ రోల్‌లో నటించాడు. భారీ క్యాస్టింగ్ నటించిన ఈ సినిమాను ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అయితే, అక్కడి ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వేశారు.

ఈ చిత్ర ప్రీమియర్స్‌కి మాసివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో ‘ది గోట్’ స్పెషల్ ప్రీమియర్స్‌లో 463 లొకేషన్స్‌లో వేయగా 789K డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా కెనడా రిపోర్ట్ రాలేదని.. ఇప్పటివరకు వచ్చిన ప్రీమియర్ కలెక్షన్స్ చూస్తే, ఇది విజయ్ కెరీర్‌లో రెండో హయ్యెస్ట్ ప్రీమియర్ డే అని ట్రేడ్ స్పెషలిస్ట్‌లు చెబుతున్నారు.

‘ది గోట్’ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, లైలా, ప్రభుదేవా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు