సమీక్ష : “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” – అంత గ్రేట్ గా అనిపించదు

The GOAT Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 05, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ

దర్శకుడు: వెంకట్ ప్రభు

నిర్మాతలు : కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నుని

ఎడిట‌ర్ : వెంకట్ రాజేన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చింది. మరి తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథ లోకి వస్తే.. గాంధీ (విజయ్ జోసెఫ్) భారత దేశం తరపున సీక్రెట్ గా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. అయితే ఒక మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ (మైక్ మోహన్) మట్టుబెడతాడు. అయితే ఆ తర్వాత మరో మిషన్ మీద మరో దేశానికి తన భార్య అను (స్నేహ) తన కొడుకు జీవన్ తో కలిసి ట్రిప్ కి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది? తన కొడుకు జీవన్ కి ఏమవుతుంది. పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తాడు? ఇద్దరూ తండ్రీకొడుకులు శత్రువులుగా ఎలా మారతారు? చివరకి జీవన్ (జూనియర్ విజయ్) కథ ఎలా ముగుస్తుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో దళపతి విజయ్ మంచి హైలైట్ గా నిలిచాడు అని చెప్పాలి. తన మార్క్ స్వాగ్, హీరోయిజం చాలా సినిమాల్లో చూసాం కానీ ఈ సినిమాలో అంతకు మించి తను సర్ప్రైజ్ చేస్తాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో దళపతి విజయ్ అదరగొట్టాడు అని చెప్పాలి. అలాగే తనతో కనిపించిన ప్రభుదేవా, జయం రవి సహా ప్రశాంత్ లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అదరగొట్టారు.

అలాగే స్నేహ తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి తన గ్లామర్ షోతో సహా తనకున్న కీలక సీన్స్ లో బాగానే చేసింది. ఇక ఈ చిత్రంలో సెకండాఫ్ ని డీసెంట్ గా తీసుకెళ్లడం బాగుంది. అక్కడక్కడా మంచి హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్ ఇంకా క్లైమాక్స్ లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంట్రీతో విజయ్ రోల్స్ ని హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇంకా సెకండాఫ్ లో త్రిష, శివ కార్తికేయన్ ల సర్ప్రైజింగ్ క్యామియోలు బాగున్నాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు పర్వాలేదు అనిపిస్తాయి.
 

మైనస్ పాయింట్స్:

మరి ఈ సినిమా రీసెంట్ టైంలో విజయ్ అటు దర్శకుడు వెంకట్ ప్రభు నుంచి మరో వీక్ వర్క్ అని చెప్పాలి. సినిమా నిడివి బాగా పెద్దది కావడంతో చాలా వరకు సినిమా సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ కథనం కూడా అంత ఎంగేజింగ్ గా ఏమి ఉండదు. ఇక సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సినిమాలు అలా గుర్తొస్తాయి కానీ పోస్ట్ క్లైమాక్స్ చూశాక మాత్రం హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ ని చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మరింత డిజప్పాయింట్ అవుతారు.

ఈ సినిమాతో లింక్ ఉందని ముందే కామెంట్స్ వచ్చాయి. సరిగ్గా దీనినే చూపించి ఆడియెన్స్ ని మరింత నీరు గార్చారు. మరి ఆ సినిమాని చూడని వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు తప్పితే ఇది కూడా అంత ఎగ్జైటింగ్ గా ఉండదు. అలాగే సినిమాలో కొన్ని ఓవర్ సీన్స్ కూడా ఉన్నాయి. లాజిక్ లేకుండా సిల్లీగా చికాకు తెప్పించేలా అనిపిస్తాయి.

ఇక వీటితో పాటుగా మీనాక్షి చౌదరికి పెద్దగా ఇంపార్టెన్స్ సినిమాలో లేదు ఏదో నామమాత్రంగా మాత్రమే తీసుకున్నారు అని చెప్పాలి. ఇంకా చాలా సీన్స్ ఊహాజనితంగానే అనిపిస్తాయి. అలాగే పోస్ట్ క్లైమాక్స్ పోర్షన్ జెమినీ మ్యాన్ చూసిన వాళ్ళకి నిరాశ కలిగిస్తుంది.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొన్ని అంశాల్లో చాలా బాగున్నాయి. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నాయని చెప్పాలి. టెక్నికల్ గా విజయ్ డీ ఏజింగ్ లుక్ ని తీర్చిదిద్దిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. యంగ్ లుక్ లో విజయ్ సీన్స్ ని టీం బాగా చూపించారు. ఇక కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వీక్ గా కనిపిస్తాయి. యువన్ సాంగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ ని తన స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు వెంకట్ ప్రభు విషయానికి వస్తే.. తన సినిమాలపై మినిమం ఐడియా ఉన్న మూవీ లవర్స్ కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు. కానీ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. నైస్ గా హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ ని తస్కరించి విజయ్ కి సూటయ్యేలా అక్కడక్కడ ఫ్యాన్స్ స్టఫ్ తో తను మార్చేశాడు. కేవలం కొన్ని అంశాల్లో తప్ప తన దర్శకత్వం గత సినిమాలతో పోలిస్తే వీక్ గా ఉంటుంది అని చెప్పక తప్పదు.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” సినిమాలో విజయ్ అదరగొడతాడు అని చెప్పాలి. మెయిన్ గా తన ఫ్యాన్స్ అతన్ని నెగిటివ్ రోల్ లో చూడటం ఎగ్జైట్ చేస్తుంది. అలాగే కొన్ని మూమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ వాహ్.. అనిపించే రేంజ్ లో ఎక్కడా అనిపించవు. పైగా సాగదీతగా అనిపించే కథనం, చాలా చోట్ల ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే డిజప్పాయింట్ చేస్తుంది. ఇక వెంకట్ ప్రభు నుంచి అయితే కొత్తదనాన్ని ఆశించే వారు మరింత డిజప్పాయింట్ అవ్వొచ్చు. వీటితో అయితే ఈ చిత్రం అంత గ్రేట్ గా ఏమీ అనిపించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version