బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ గతంలో క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. అయితే, తనకు బ్రెస్ట్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టినట్లు తహీరా కశ్యప్ చెప్పుకొచ్చింది. రెండోసారి క్యాన్సర్‌పై తాను యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతానని తహీరా కశ్యప్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తహీరా కశ్యప్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన తహీరా కశ్యప్ ఏడేళ్ల కిందట క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం తహీరా కశ్యప్ కు బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టినట్లు ఆయుష్మాన్ ఖురానా భార్య వెల్లడించారు. ఆమె క్యాన్సర్ నుంచి బయట పడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.