ఇస్మార్ట్ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది !

Published on Oct 25, 2020 2:12 am IST


డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే ఆ మధ్య వచ్చిన మూవీతో పూరి భారీ విజయాన్నే నమోదు చేసాడు. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ హిట్ ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. ఏది ఏమైనా పూరి పడిపోయి ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ప్రతిసారి.. ఏదొక హిట్ వచ్చి పూరిని నిలబెడుతుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పూరి – రామ్ కలయికలో మరో సినిమా రాబోతోందని తెలుస్తోంది.

కాకపోతే మరో ఏడాది సమయం పడుతుందట. ఇక ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ గ్యాంగ్ స్టర్ డ్రామాతో మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతొంది. వచ్చే నెల 25 నుండి హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలుకానుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ స్ తీయబోతున్నారని పూరి టీంలోని ఓ సభ్యుడు వ్యక్తపరిచిన లేటెస్ట్ అప్ డేట్. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More