ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ అయినటువంటి చిత్రాల్లో బాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం “ది కేరళ స్టోరీ” కూడా ఒకటి. ఆదా శర్మ మెయిన్ లీడ్ లో సిద్ది ఇద్నాని తదితరులు ముఖ్య పాత్రల్లో సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా అయితే తెరకెక్కి థియేటర్స్ లో భారీ హిట్ అయ్యింది.
గతంలో వచ్చిన “ది కాశ్మిర్ ఫైల్స్” ఏ రకంగా భారీ బాక్సాఫీస్ హిట్ అయ్యిందో ఈ చిత్రం కూడా అదే తరహాలో భారీ వసూళ్లతో లాంగ్ రన్ సొంతం చేసుకొని వచ్చింది. అయితే థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అప్పుడు మిస్ అయ్యినవారు ఓటిటిలో చూద్దాంలే అనుకున్నవారు చాలా మందే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఈ చిత్రానికి ఇపుడు ఎదురైనట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి ఇప్పుడు ఒక్క ఓటిటి పార్ట్నర్ కూడా మేకర్స్ కి దొరకడం లేదట. దర్శకుడు చెప్తున్నా మాట ప్రకారం తమ చిత్రానికి ఓటిటి రైట్స్ తీసుకునేవారు ఎవరూ ముందుకు రావడం లేదని మంచి స్ట్రీమింగ్ పార్ట్నర్ కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. దీనితో అయితే ఈ వార్త ఆసక్తిగా మారింది. మరి ఈ అవైటెడ్ చిత్రం ఎప్పటికి ఓటిటి లో వస్తుందో చూడాలి.