సమంత, కీర్తి సురేశ్‌ను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్


తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పలువురు హీరోయిన్లను ఆయన మోసం చేశారని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంతి దత్‌ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సస్టెయిన్ కార్ట్ సంస్థను స్థాపించి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడులు పెట్టించి కాంతి దత్‌ వారిని మోసగించాడట. బిజినెస్ విమెన్ శిల్పారెడ్డి అనే మహిళ కూడా మోసపోయానని కాంతి దత్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా శిల్పారెడ్డి, కాంతి దత్‌ పై ఫిర్యాదు చేయడంతో అతని మోసాలు బయటపడ్డాయి. అతడు సుమారు రూ.100 కోట్లకు పైగా దోచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు సమంత, కీర్తి సురేశ్ లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా కాంతి దత్‌ చేతిలో మోసపోయారని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది.

Exit mobile version