పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం ఆదుకున్నారు. ఇక ప్రస్తుతం మారుతీ తో ది రాజా సాబ్, అలానే నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడి మూవీస్ చేస్తున్నారు. అనంతరం సలార్ పార్ట్ 2 మూవీ చేయనున్నారు. అయితే అటు కల్కి తో పాటు సలార్ పార్ట్ 2 పై ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ రాజా సాబ్ విషయంలో మాత్రం వారు మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
నిజానికి బాహుబలి సిరీస్ సినిమాల తరువాత ప్రభాస్ నుండి ఆ స్థాయి మంచి కమర్షియల్ మూవీ రాలేదు. ఇక ఇటీవల రాజా సాబ్ గురించి మారుతీ మాట్లాడుతూ, ప్రభాస్ నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే మంచి కమర్షియల్ అంశాలు అన్ని మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. బాహుబలి సిరీస్ సినిమాల తరువాత ప్రభాస్ నుండి వచ్చే ప్రతి మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి, తెలుగుతో పాటు అన్ని భాషల ఆడియన్స్ ని మారుతీ మెప్పించాలి.
నిజానికి అందరి అంచనాలు అందుకుని ది రాజా సాబ్ ని సక్సెస్ చేయడం మారుతీకి ఒకింత ఛాలెంజ్ అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా తమ టీమ్ మాత్రం డార్లింగ్ ప్రభాస్ కి భారీ హిట్ అందించేందుకు అన్నివిధాలా ఎంతో కష్టపడుతోందని, త్వరలోనే రాజా సాబ్ గురించిన మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా అందిస్తాం అని అంటున్నారు మారుతీ.