త్వరలో “ది రాజా సాబ్” అప్డేట్స్!

త్వరలో “ది రాజా సాబ్” అప్డేట్స్!

Published on Jun 25, 2024 7:34 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత ది రాజా సాబ్ మూవీ అప్డేట్స్ షురూ కానున్నాయి.

కల్కి చిత్రం పై ఉన్న భారీ అంచనాల కారణంగా సినిమాకి సంబందించిన ఎలాంటి అప్డేట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. తాజాగా జరిగిన పీపుల్ సెలబ్రేషన్ ఈవెంట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కృతి ప్రసాద్ మాట్లాడటం జరిగింది. త్వరలో ది రాజా సాబ్ అప్డేట్స్ రానున్నట్లు తెలిపింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు