“ది రాజా సాబ్” మ్యూజికల్ సిట్టింగ్స్ షురూ!

“ది రాజా సాబ్” మ్యూజికల్ సిట్టింగ్స్ షురూ!

Published on Jun 25, 2024 9:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తర్వాత ది రాజా సాబ్ మూవీ అప్డేట్స్ షురూ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఫ్యాన్స్ కు అందించారు.

ఈ చిత్రం మ్యూజికల్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చిత్ర దర్శకుడు మారుతి తో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. వారే వారే వచ్చేశాడు రాజా సాబ్ అంటూ ఉన్న ప్రోమో ను రిలీజ్ చేశారు. బీట్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు