ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఆసక్తి రేపుతున్న “ది రాజా సాబ్”

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి దీనిపై కూడా అంతకంతకు సాలిడ్ హైప్ అయితే బిల్డప్ అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న ప్రభాస్ పై వదిలిన స్టైలిష్ పోస్టర్ కూడా అదిరిపోయింది. దీనితో ఈ సినిమా నుంచి ప్రభాస్ బర్త్ డే ట్రీట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ రేపు ఓ స్పెషల్ అప్డేట్ ని కూడా ప్రామిస్ చేశారు.

అయితే ఇప్పుడు దీనిపై వదిలిన పోస్టర్ తో మరింత ఆసక్తి రేగుతుంది అని చెప్పాలి. ఒక సింహాసనం లాంటి దానిని ఒక అనుమానాస్పద రూమ్ లో రివర్స్ లో పెట్టి అతను రేపు వస్తున్నాడు అంటూ దర్శకుడు మారుతి ఆసక్తి రేపారు. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూసేందుకు హారర్ ఎలిమెంట్స్ తో కనిపిస్తున్నాయి. మరి ఈ పోస్టర్ తోనే రేపు వచ్చే ట్రీట్ ఎలా ఉంటుందో చెబుతున్నారు. మరి ఆ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version