కరోనా వల్ల వెబ్ సిరీస్ లకు డిమాండ్ !

Published on Apr 1, 2020 6:04 pm IST

నేటి యువత ప్రస్తుతం ఎక్కువుగా డిజిటల్ స్ట్రీమింగ్‌ లోనే గడిపేస్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు డిజిటిల్ వైపు చూస్తున్నాయి. కరోనా దెబ్బకు థియేటర్స్ కూడా బంద్ అవ్వడంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు డిజిటిల్ వైపు దృష్టి పెడుతున్నాయి. వెబ్ సిరీస్ కథలను రాయించే పనిలో ఉన్నాయి. లాక్ డౌన్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చేయనున్నాయి.

ఇప్పటికే సమంత అక్కినేని కూడా ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లోనటించింది. సమంత బాటలోనే పాయల్ రాజ్ ఫుత్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తున్నారు. పాయల్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటించనుంది. ఇక తమన్నా తమిళంలోని ఆ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ను రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది.

అయితే సౌత్ ఇండియాలో, తెలుగులో వచ్చిన సిరీస్‌ లు అంతగా ఆదరణకు నోచుకోలేదు. అయినా సౌతిండియాలో తమ నెట్‌ వర్క్‌ ను పెంపొందించుకోవడానికి సదరు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ బాగానే ప్లాన్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More