ఓటిటిలో వచ్చాక కూడా “డబుల్ ఇస్మార్ట్” కి అదే రెస్పాన్స్


టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు అయితే రీచ్ కాలేకపోయింది.

థియేటర్స్ రిలీజ్ తర్వాత ఆడియెన్స్ నుంచి ఏదైతే రెస్పాన్స్ ని అందుకుందో ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ అయ్యాక కూడా అదే రీతి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఈ చిత్రం మూటగట్టుకుంకుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి అసలు ఎలాంటి సినిమాలు సీన్లు తీసే పూరి ఇలాంటి సీన్స్ చేశాడా అంటూ సగటు టాలీవుడ్ లవర్ భావిస్తున్నాడు.

అలాగే సినిమాలో ఆలీ సీన్స్ పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. మరి వీటితో మాత్రం పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమాపై మరింత ప్రెజర్ పడుతుంది అని చెప్పాలి. మరి మళ్ళీ పూరి తన మార్క్ కం బ్యాక్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version