‘పుష్ప-2’ ప్రీమియర్స్‌కు రంగం సిద్ధం.. ఫస్ట్ షో పడేది అప్పుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు జరిగినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటలకు ‘పుష్ప-2’ గ్రాండ్ ప్రీమియర్ షో పడనుందట.

ఇలా ఒకరోజు ముందుగానే ‘పుష్ప-2’ ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండటంతో, ఈ సినిమాపై వారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రష్మిక మందన్న హీరోయిన్‌గా ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version