‘నాగార్జున’తో సాయి పల్లవి – శివ కార్తికేయ‌న్ !

దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’కి సంబంధించి విడుదలైన ప్రోమోలో, హౌస్ మేట్స్ అందరూ కలిసి దీపావ‌ళి సంబరాల్లో పాల్గొన్నారు. ఐతే, దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కోసం కింగ్ నాగార్జునతో కలిసి అమరన్ టీమ్ సాయి ప‌ల్ల‌వి, శివ కార్తికేయ‌న్ కూడా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా నాగార్జున, ‘అమరన్’ టీమ్ తో సరదాగా ముచ్చటించారు. ముఖ్యంగా సాయి పల్లవితో మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version