ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్‌లోనూ ఆడియెన్స్ పట్టం కట్టారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ దక్కుతోంది. హిందీలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ రికార్డు క్రియేట్ చేసింది.
ఇక నార్త్‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే, ఓ థియేటర్ మాత్రం ‘పుష్ప-2’ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ‘పుష్ప-2’ చిత్రాన్ని చూసేందుకు ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకుని షో టైమ్‌కి థియేటర్‌కు వెళ్లారు అభిమానులు. అయితే, సదరు థియేటర్లో ‘పుష్ప-2’ సినిమాకు బదులు వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ ప్రదర్శిస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం పేర్కొంది.
దీంతో ‘పుష్ప-2’ సినిమాను చూసేందుకు వచ్చిన అభిమానులు థియేటర్ యాజమాన్యం పై మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా పుష్ప-2 షో ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వారు ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.