“థీమ్ ఆఫ్ కల్కి” సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్!

“థీమ్ ఆఫ్ కల్కి” సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్!

Published on Jun 25, 2024 8:20 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటానిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే అన్ని చోట్ల భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి.

ఈ చిత్రం నుండి థీమ్ ఆఫ్ కల్కి సాంగ్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు