‘జవాన్’ లో క్యామియోస్ లేవు, ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంది – డైరెక్టర్ అట్లీ

‘జవాన్’ లో క్యామియోస్ లేవు, ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంది – డైరెక్టర్ అట్లీ

Published on Sep 7, 2023 3:01 AM IST

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జవాన్ మూవీ తెరకెక్కించారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ స్థాయిలో గౌరి ఖాన్ నిర్మించారు. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన జవాన్ రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఈ మూవీలో కోలీవుడ్ నటుడు ఇళయదళపతి విజయ్ క్యామియో రోల్ లో కనిపించనున్నారని కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ, విజయ్ అన్న క్యామియో జవాన్ లో లేదు. తప్పకుండా అవకాశం వస్తే భవిష్యత్తులో షారుఖ్ గారు, విజయ్ అన్నల కాంబోలో ఒక భారీ మల్టి స్టారర్ ప్లాన్ చేస్తానని అన్నారు. ఇక ఈ మూవీలో తాను మాత్రం సర్ప్రైజింగ్ గా ఒక చిన్న క్యామియో రోల్ లో కొన్ని క్షణాలు కనిపిస్తానని అన్నారు. తాను సహా యావత్ యూనిట్ మొత్తం కూడా జవాన్ కోసం ఎంతో కష్టపడ్డారని, అలానే తప్పకుండా ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ మూవీకి మంచి ఆదరణ అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు అట్లీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు