“ఆదిపురుష్”లో ఈ రోల్ కు స్పెషల్ ప్లాన్ లేదా.?

Published on Nov 24, 2020 7:11 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో రావణ పాత్రలో కనిపించడం కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కల మిగతా కీలక పాత్రలకు సంబంధించి గత కొన్నాళ్ల నుంచి గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ చిత్రంలోని ఓ పాత్రకు సంబంధించి టాక్ వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ సినిమా లోని లక్ష్మణ పాత్రకు గాను స్పెషల్ ప్లానింగ్స్ లో ఏమీ లేనట్టు తెలుస్తుంది.

అయితే బాలీవుడ్ నుంచి ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడిని ఈ రోల్ ని మేకర్స్ పిక్ చెయ్యాలనే యోచనలో ఉన్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కీలక పాత్రకు గాను మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే 2022 ఆగష్టు 11న విడుదల చేయన్నునారు.

సంబంధిత సమాచారం :

More