“పుష్ప” క్రేజీ గాసిప్ పై ఎలాంటి నిజము లేదా.?

Published on Nov 29, 2020 9:38 pm IST


ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “పుష్ప” విషయంలో మొదటి నుంచీ సస్పెన్సు గా మారిన ప్రశ్న ఈ చిత్రంలో విలన్ రోల్ ఎవరు చేస్తారు అని. అయితే ఇప్పటికే దర్శకుడు సుకుమార్ పలువురు పేర్లను అనుకోవడం సంప్రదించడం అవి సెట్ కాకపోవడం కూడా జరిగాయి.

అయితే గత కొన్ని రోజుల కితం మాత్రం ఈ రోల్ విషయంలో ఒక ఊహించని గాసిప్ వైరల్ అయ్యింది. అదే ఈ చిత్రంలో విలన్ రోల్ కు గాను కోలీవుడ్ స్టార్ నటుడు ‘చియాన్’ విక్రమ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు ఈ అంశంపైనే క్లారిటీ వినిపిస్తుంది.

ఈ గాసిప్స్ లో ఎలాంటి నిజమూ లేదు అన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా విక్రమ్ ను అయితే ఇంకా ఎవరు సంప్రదించలేదని కూడా తెలుస్తుంది. మరి అసలు ఈ రోల్ లో ఎవరు కనిపిస్తారో అన్నది చూడాలి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More