చరణ్ ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పవట!

Published on Oct 24, 2020 9:00 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో అందరు టాప్ హీరోలలో ఒక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మినహా మిగతా అంతా ఒక సినిమా చేస్తుండగానే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుంటున్నారు. కానీ చరణ్ మాత్రం ఇంకా తాను చేస్తున్న రెండు ప్రాజెక్టులకే స్టిక్ అయ్యి ఉన్నారు. అయితే ఇప్పుడు నటిస్తున్న “రౌద్రం రణం రుధిరం” నుంచి చరణ్ పై ఒక అప్డేట్ వచ్చి చాలా కాలమే అయ్యింది.

కానీ ఇటీవలే రామరాజు ఫర్ భీం టీజర్ లో తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో పలకరించారు. ఇక ఇదే సమయంలో చరణ్ అభిమానాలు ఈ రాబోయే రోజుల్లో చరణ్ పై ఏమన్నా అప్డేట్ ఇస్తే బాగుంటుందని RRR టీం ను అడగ్గా వారు సింపుల్ గానే అలాంటివి ఏమీ లేవని చెప్పేసారు. ఇప్పుడేగా చరణ్ గర్జన విన్నారు కొన్ని రోజులు ఆ రీసౌండ్ అలా ఉండనివ్వండి అంటూ తేల్చేసారు. సో రామ్ చరణ్ అభిమానులు RRR యూనిట్ నుంచి ఇంకొన్నాళ్ల వరకు ఎలాంటి అప్డేట్స్ కోసం ఎదురు చూడడం ఆపెయ్యల్సిందే.

సంబంధిత సమాచారం :

More