‘పవన్’కి శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు వీళ్లే !

‘పవన్’కి శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు వీళ్లే !

Published on Sep 2, 2024 4:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ హడావుడే కనిపిస్తోంది. అభిమానులతో పాటు రాజకీయ – సినీ ప్రముఖుల్లో కొందరు పవన్ కి బర్త్‌ డే విషెస్ చెప్పారు. మరి ఎవరు ఏ విధంగా, పవర్ స్టార్ కి బర్త్‌ డే విషెస్ చెప్పారో చూద్దాం.

సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ‘‘ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మన పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకంక్షలు’’ అని రాఘవేంద్రరావు పోస్ట్ చేశారు.

రాజకీయ నాయకుడు కిషన్‌రెడ్డి విషెస్ చెబుతూ.. ‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన వ్యవస్థాపకులు పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై మీకున్న అంకితభావం, పట్టుదల అభినందనీయం. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ అని తనదైన శైలిలో పవన్ కి బర్త్‌ డే విషెస్ చెప్పారు.

బండి సంజయ్‌ కుమార్‌ కూడా ‘‘సంకల్పమే బలం, జనహితమే ధ్యేయంగా.. జన సంక్షేమం కోసం తపిస్తున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ కొండగట్టు ఆంజనేయస్వామి కృపతో ఎల్లప్పుడూ ప్రజా సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పోస్ట్ పెట్టారు.

నిర్మాత బన్నీ వాస్‌ విషెస్ చెబుతూ.. ‘‘వన్‌ అండ్‌ ఓన్లీ పవర్‌స్టార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని.. ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. వినయం, అంకితభావంతో మీరు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాగే ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అని విషెస్ చెప్పారు.

కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ పెమ్మసాని విషెస్ చెబుతూ.. ‘‘గొప్ప స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజాసేవలో నిమగ్నమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన మీ ప్రస్థానం ఒక అధ్యాయం. రాజకీయ ప్రయాణంలో మీ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మీరు వేసిన అడుగులు చరిత్రాత్మకం. ప్రజా నాయకుడిగా మీరు మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని పెమ్మసాని విషెస్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు