2025 ఆస్కార్ బరిలో సూర్య, పృథ్వీ సినిమాలు.. మరో 4 సినిమాలివే

ప్రపంచ ప్రఖ్యాత సినిమా అవార్డ్స్ లలో ఒకటైన ఆస్కార్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా 97వ అకాడమీ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో అనేక దేశాల నుంచి ఎన్నో విభాగాల్లో పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే మన నుంచి కూడా ఫెడరేషన్ తరపున పలు చిత్రాలు వెళ్లినప్పటికీ వాటికి ఆస్కార్ బరిలో అఫీషియల్ ఎంట్రీ దక్కలేదు. మరి మన దేశంలో ఫెడరేషన్ తరపు నుంచి కాకుండా కొన్ని సినిమాలు మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి.

మరి ఈ చిత్రాల్లో సూర్య నటించిన భారీ చిత్రం కంగువా అలాగే మళయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్(ఆడు జీవితం) అలాగే మరో నాలుగు సినిమాలు ఇండియా నుంచి లిస్ట్ లో నిలిచాయి. అయితే ఆ చిత్రాలు హిందీ నుంచి ‘సంతోష్’ అలాగే మరో చిత్రం “స్వాతంత్య్ర వీర్ సావర్కర్” అలాగే మళయాళ సినిమా నుంచి “ఆల్ వి ఇమాజిన్ ఏస్ లైట్” అలాగే “గర్ల్స్ విల్ బి గర్ల్స్” లు నిలిచాయి. అయితే రేపు జనవరి 8 నుంచి వోటింగ్స్ స్టార్ట్ కానుండగా వీటిలో ఏవి చివర వరకు వెళ్తాయో చూడాలి.

Exit mobile version