“విశ్వంభర” టీజర్.. కంప్లైంట్స్ ఇవే..

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ చిత్రం “విశ్వంభర” కోసం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సినిమా తాలూకా అవైటెడ్ టీజర్ ని మేకర్స్ ఇప్పుడు విడుదల చేయగా ఈ ఫాంటసీ వండర్ టీజర్ కి మంచి రెస్పాన్స్ తో పాటుగా మిక్స్డ్ టాక్ కూడా ఆడియెన్స్ నుంచి వచ్చింది.

అయితే సినిమాలో భారీ విజువల్స్ వింత వింత జంతువులు కనిపిస్తున్నాయి. అలాగే మెగాస్టార్ ఎంట్రీ వి ఎఫ్ ఎక్స్ బాగానే ఉన్నాయి కానీ వీటిలోని కొన్ని కంప్లైంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. స్టార్టింగ్ సీక్వెన్స్ కొన్ని డ్రాగన్స్ లాంటివి చిరు ఎంట్రీలో వెనుక గాల్లో తేలే కొండలు, ఓ తెగ అందులో చిన్న పాప వీరి లుక్స్ లో అవతార్ సినిమా షేడ్స్ కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది.

అయితే ఆ డ్రాగన్స్ లాంటివి హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా కామన్. అలాగే ఆ చిన్న పాప వారి తెగ సినిమాలో చూసేటప్పటికి అవతార్ కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు అన్నట్టు తెలుస్తుంది. కానీ చిరు రెక్కల గుర్రం సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ ని ఏమన్నా కొత్తగా ట్రై చేయాల్సింది. మొత్తానికి అయితే గ్రాండ్ విజువల్స్ ని ప్రామిస్ చేసినప్పటికీ ఇలాంటి వాటిలో మరింత జాగ్రత్త వహించాల్సింది.

Exit mobile version