గత వారం తెలుగు టాప్ 5 ప్రోగ్రామ్స్ ఇవే..!

Published on Jul 3, 2020 12:10 am IST


కరోనా కష్ట కాలం లో ఈ సమయాన్ని ఎక్కువగా టెలివిజన్ ప్రపంచానికే వినియోగించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే మన తెలుగు టెలివిజన్ ఛానెల్స్ వారు కూడా కొత్త కంటెంట్ కి కాస్త లోటు వచ్చినా మ్యానేజ్ చేస్తూ ఈ గత మూడు నెలల కాలాన్ని తెలుగు టీవీ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చారు. అలా గత వారం టాప్ 5 లో నిలిచిన తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ ఏంతో బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించారు.

వీటిలో నెంబర్ 1 స్థానంలో ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఈటీవీ న్యూస్ భారీ ఎత్తున 6 లక్షల 46 వేలకు పైగా ఇంప్రెషన్స్ రాబట్టగా రెండవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “మహర్షి” జెమినీ టీవీలో ప్రసారం కాగా 6 లక్షల 24 వేలకు పైగా ఇంప్రెషన్స్ ను రాబట్టింది. ఇక అలాగే మూడో స్థానంలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ కూడా 6 లక్షల 24 వేలకు పైగా ఇంప్రెషన్స్ తో నిలిచింది.

ఇక నాలుగవ స్థానానికి వస్తే మళ్లీ ఈటీవీ ఛానెల్ నుంచే ఉంది. ఆ ఛానెల్లో ప్రసారం అయ్యే టాప్ ఎంటర్టైనింగ్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ 4 లక్షల 70 వేలకు పైగా ఇంప్రెషన్స్ తో నిలిచింది. ఇక ఐదవ స్థానంలో జీ తెలుగు ఛానెల్లో ప్రసారం అయ్యే ప్రేమ ఎంత మధురం ధారావాహిక 4 లక్షల 20 వేలకు పైగా ఇంప్రెషన్స్ తో నిలిచింది. ఈ టాప్ 5 ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ లో గత కొన్ని వారాల నుంచి ఖచ్చితంగా ఈటీవీ నుంచే రెండు ప్రోగ్రామ్స్ ఉంటుండడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More