బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఈ నలుగురు సెలెబ్రిటీలు?

Published on Jun 30, 2020 9:00 pm IST


సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళుతున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ కోసం అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు. స్టార్ మా యాజమాన్యం ఇప్పటికే దీని కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక ఈ సీజన్లో హౌస్ లోకి వెళ్లే సెలెబ్రిటీల కోసం జల్లెడపడుతున్నారు. షోకి వస్తున్న ఆదరణ రీత్యా…బాగా తెలిసిన పాపులర్ ఫేసెస్ ని బిగ్ బాస్ ఇంటిలోకి పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే అనేక పేర్లు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి.

తాజాగా యాంకర్ ఝాన్సీ, సింగర్ స్మిత, నటుడు తాగుబోతు రమేష్ మరో నటుడు నందు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరు కనుక ఒకే చెవితే బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని నిర్వాహకుల ఆలోచనట. మరి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సివుంది. ఇక బిగ్ బాస్ గత సీజన్ కి హోస్ట్ గా నాగార్జున ఉండగా, సీజన్ ఫోర్ కి కూడా ఆయనే వ్యాఖ్యాతగా ఉండే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

More