ఓటిటి లోకి హరోం హర…ఆ సీన్ల కొనసాగింపు!

ఓటిటి లోకి హరోం హర…ఆ సీన్ల కొనసాగింపు!

Published on Jul 15, 2024 6:06 PM IST

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు ఇటీవలి చిత్రాలతో పోలిస్తే, హరోం హర మంచి మౌత్ టాక్ అందుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియో ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది.

నేడు డిజిటల్‌ ప్రీమియర్ గా అందుబాటులోకి వచ్చింది. థియేట్రికల్ మరియు ఓటిటి విడుదల మధ్య దాదాపు నాలుగు వారాల గ్యాప్ ఉంది. అయితే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతు ఇందులో ఒక పాత్రలో నటించారు. ఆ పాత్రకి సంబందించిన సన్నివేశాలు ట్రిమ్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే ఆ సన్నివేశాలు అలానే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో తొలగిస్తారో లేదో చూడాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్ బాబుకు జోడీగా మాళవిక నాయర్ నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రంకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు